Kareena Kapoor : వావ్.. కన్నడ స్టార్ తో కరీనా కపూర్

Update: 2024-03-18 09:47 GMT

బాలీవుడ్ భామలు ఒక్కొక్కరుగా సౌత్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణే కల్కి 2898 సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా దేవరసినిమాతో సౌత్ లోకి అడుగు పెడుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన ఈ బ్యూటీ నటించనుంది.

ఇప్పుడు వీరి బాటలోనే కరీనా కపూర్ (Kareena Kapoor) కూడా అడుగులేస్తోంది. త్వరలోనే ఓ భారీ ప్రాజెక్ట్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అదొక పాన్ ఇండియా సినిమా అని చెప్పుకొచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటనతో కరీనా ఎప్పుడెప్పుడు సౌత్ లో నటిస్తుందా.. అనే ఆమె అభిమానుల ఆశకు తెరపడింది. కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News