ఈ యేడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు కార్తీ అంటూ ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్న టైమ్ లో సడెన్ గా కర్చీఫ్ వేశాడు. అన్నగారు వస్తారు అనే మూవీతో రాబోతున్నాడు. అంటే తమిళ్ మూవీకి తెలుగు వెర్షనే ఇది. నిజానికి ఈ మూవీ ఎప్పుడో పూర్తవుతుంది. కానీ రిలీజ్ టైమ్ మాత్రం బాగా లేట్ అయింది. ఓ దశంలో ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది అనే టాక్ కూడా వినిపించింది. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీతో కృతిశెట్టి తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది. బట్ లేట్ కారణంగా ఆమె డిజప్పాయింగ్ అయ్యింది. ఫైనల్ గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
వా వాథియార్ అనే టైటిల్ తో రూపొందిన సినిమా ఇది. నలన్ కుమార్ స్వామి డైరెక్షన్ చేశాడు. పోలీస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన చిత్రం. ఆ మధ్య విడుదలైన టీజర్ చూస్తేనే కార్తీ కొత్తగా ట్రై చేస్తున్నాడు అనేలా అనిపించింది. అతని లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రానికి తెలుగు టైటిల్ తో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో మెప్పించారు. మరి ఈ డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు అని చెప్పింది మూవీ టీమ్. సో.. ఈ యేడాది కార్తీ మూవీ రిలీజ్ అవుతుంది అనే చెప్పాలి.