అన్నీ ఉన్నా అదృష్టం లేని అందగత్తె అంటే కావ్య థాపర్ అనే చెప్పాలి. ఎలాంటి గ్లామరస్ పాత్రలకైనా ఓకే చెప్పే ధైర్యం ఉందీ బ్యూటీకి. ఇప్పటి వరకూ నటించడానికి పెద్దగా ఆస్కారం లేని పాత్రలే చేసింది కాబట్టి దాని గురించి అప్పుడే చెప్పలేం. తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ బాంబే భామ. ఏక్ మినీ కథ, ఊరు పేరు భైరవ కోన హిట్ అయినా అవి తనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా తెలుగులో ఈగల్, డబుల్ ఇస్మార్ట్, విశ్వం అనే మూవీస్ తో ఫ్లాపులు చూసింది. డబుల్ ఇస్మార్ట్ పై బోలెడు ఆశలు పెట్టుకుంది కానీ అడియాశలయ్యాయి.
విశ్వం తర్వాత కొన్నాళ్లుగా కనిపించడం లేదు కావ్య. ఇక తనకు టాలీవుడ్ గుడ్ బై చెప్పేసిందో అనుకుంటోన్న టైమ్ లో లేటెస్ట్ గా మరో ఆఫర్ పట్టేసింది. రీసెంట్ గా మజాకా అనే మూవీతో వచ్చిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హవీష్ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. మజాకా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. అయినా అంతకు ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్ ఇది. అందుకే హవీష్ మూవీ వెంటనే స్టార్ట్ అయింది. ఈ చిత్రంలోనే కావ్య థాపర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఇదైనా అమ్మడికి ఓ హిట్ మూవీగా నిలిచి కొత్త ఆఫర్స్ తెస్తుందేమో చూడాలి.