Double Smart : డబుల్ ఇస్మార్ట్ ను ప్రమోట్ చేస్తున్న కేసీఆర్ ఫ్యాన్స్
రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట మధ్యలో కేసీఆర్ ఫేమస్ డైలాగ్.. ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్ లో వాడే ‘‘ అయితే ఏం జేద్దామంటవ్ మరి ’’ అనే మాటను పాటలో వాడారు. అంతే మా నాయకుడి మాటను ఈ పాటలో ఎందుకు వాడారు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు గోల మొదలుపెట్టారు.;
పూరీ జగన్నాథ్ కొత్త సినిమా డబుల్ ఇస్మార్ట్ కు ఆయాచితంగా ప్రమోషన్ వస్తోంది. అంటే ఏ కష్టం పడకుండానే.. వీళ్లు ప్రెస్ మీట్స్ పెట్టకుండానే, ఇంటర్వ్యూస్ ఇవ్వకుండానే అనుకోని వివాదం వీరికి ఫ్రీ పబ్లిసిటీగా మారింది. రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఈ పాట మధ్యలో కేసీఆర్ ఫేమస్ డైలాగ్.. ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్ లో వాడే ‘‘ అయితే ఏం జేద్దామంటవ్ మరి ’’ అనే మాటను పాటలో వాడారు. అంతే మా నాయకుడి మాటను ఈ పాటలో ఎందుకు వాడారు అంటూ బిఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు గోల మొదలుపెట్టారు.
గతంలో ఎన్నోసార్లు ఈ కేసీఆర్ డైలాగ్ ఎన్నో మీమ్స్ లో వాడారు. ట్రోల్స్ కోసం వాడారు. రీల్స్ చేశారు. అప్పుడెప్పుడూ లేని ఇబ్బంది సినిమా పాటలో వాడితే తప్పేంటీ. పోనీ అదేమైనా అఫీషియల్ గా వాడిన మాటేం కాదు. ఏదో ఫైల్ కోసం క్రియేట్ చేసిందీ కాదు. క్యాజువల్ గా కేసీఆర్ అన్నమాట. దాన్ని పట్టుకుని పాటలో ఎందుకు పెట్టారంటూ ఏకంగా పూరీ జగన్నాథ్ పై కేస్ లు పెట్టడం వరకూ వెళుతున్నారు.. ఇది ఎంత వరకు న్యాయం అని పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ వాపోతున్నారు.
గతంలో పూరీ జగన్నాథ్ కెమెరా మేన్ గంగతో రాంబాబు అనే సినిమాలో తెలంగాణ ఉద్యమంపై సెటైర్స్ వేశాడు. ఇది మనసులో పెట్టుకుని కొందరు కావాలనే చేస్తున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. నిజానికి బిఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాలు చేయాలంటే తెలంగాణలో అనేక సమస్యలున్నాయి. వాటిని కాదని.. ఇంత చిన్న ఇష్యూను పట్టుకుని రచ్చ చేయడం వల్ల ఇన్ డైరెక్ట్ ఆ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ చేయడమే తప్ప వేరేం కాదు. అసలు ఆ పాటను విన్న ఎవరికైనా ఆ మాట లేకపోయినా పాట ఓకే. అందువల్ల చివర్లో చిన్న సారీ చెబితే అయిపోతుంది. అది ఆలోచించకుండా కేస్ లు, కోర్ట్ లు అని వెళ్లడం టైమ్ వేస్ట్ తప్ప మరోటి కాదేమో.