Keerthi Suresh : కీర్తి సురేష్ కు.. ఆఫర్స్ లేవా.. చేయడం లేదా..?

Update: 2025-04-15 11:47 GMT

టాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ పరంగా డల్ అయిందనే చెప్పాలి. పెళ్లికి ముందు కమిట్ అయిన బేబీ జాన్ తప్ప మరే సినిమా అప్డేట్ కనిపించడం లేదు. దీనికి తోడు తను ఫలానా హీరోతో నటించబోతోంది అనే వార్తలు రెగ్యులర్ గా వస్తున్నాయి తప్ప తనన నుంచి ఏ క్లారిటీ లేదు. కాకపోతే రెగ్యులర్ కాస్త డోస్ పెంచి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. పెళ్లికి ముందు కీర్తి కీ రోల్ లో రివాల్వర్ రాణి అనే సినిమా అనౌన్స్ అయింది. అదేమైందో ఎవరికీ తెలియదు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఆ మధ్య టీజర్ వచ్చింది అంతే. ఇవి కాక కన్నెవేడి అనే తమిళ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. తాజాగా తను రణ్ బీర్ కపూర్ సరసన ఓ హిందీ సినిమాకు కమిట్ అయిందన్న వార్తలు వస్తున్నాయి.

ఇక తెలుగు విషయంలోనూ చాలామంది హీరోలతో నటించబోతోందనే వార్తలైతే వస్తున్నాయి కానీ ఏదీ కన్ఫార్మ్ కాదు. జస్ట్ రూమర్స్ గానే ఉంటున్నాయి. అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ పై మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటున్నారు. ఆ కారణంగానే సౌత్ లో ఎవరూ పట్టించుకోవడం లేదనే హిందీ మార్కెట్ పై ఫోకస్ చేస్తోందనీ.. ఎక్స్ పోజింగ్ పరంగానూ హద్దులు దాటేయడానికీ సిద్ధం అనే హింట్స్ ఇవ్వడానికే హాట్ ఫోటో షూట్స్ అంటున్నారు.

మరోవైపు కీర్తి సురేష్ తనకు తగ్గ పాత్రల కోసం చూస్తోంది అనేవారూ ఉన్నారు. అలా అనుకుంటే తనకు తగ్గవి కాబట్టే కదా రివాల్వర్ రీటా, కన్నెవేడి వంటి మూవీస్ కు కమిట్ అయింది. మరి అవెందుకు అప్డేట్స్ లో లేవు అనే ప్రశ్నలూ వస్తాయి. ఇవి కాక దసరా తప్ప ఈ నాలుగైదేళ్లలతో తనకు సరైన హిట్టూ పడలేదు. మొత్తంగా తన గురించి రకరకాల వార్తలైతే వస్తున్నాయి కానీ తను మాత్రం దేనికీ రియాక్ట్ కావడం లేదు. సో.. ఇక ఈ రూమర్స్ ను లైట్ తీసుకుంటే బెటర్. ముఖ్యంగా తెలుగులో ఫలానా హీరోతో చేస్తోంది టైప్ రూమర్స్ ను.

Tags:    

Similar News