Keerthy Suresh: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Keerthy Suresh: హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ పర్సనాలిటీని మార్చుకుంటూ ఉండాలి.;
Keerthy Suresh (tv5news.in)
Keerthy Suresh: గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ అంటే కేవలం ఒక కమర్షియల్ పంతా వరకే పరిమితం అనుకునే ఈ రోజుల్లో చాలాతక్కువ మంది హీరోయిన్లు క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలకు ఓకే చెప్తారు. అందులో తమ పాత్ర నచ్చితేనే దానికి ప్రాణం పోస్తారు. ప్రస్తుతం అలా టాలీవుడ్‌లో ఉన్న అతి తక్కువమంది హీరోయిన్లలో కీర్తి సురేశ్ కూడా ఒకరు.
హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ పర్సనాలిటీని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తమ అందానికి కొత్త హంగులను దిద్దుకుంటూ ఉండాలి. అలా అయితేనే కొత్త కొత్త పాత్రలు తమరిని వెతుక్కుంటూ వస్తాయని వారి నమ్మకం. అలా కీర్తి సురేశ్ కొత్త మేక్ ఓవర్ చూస్తుంటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే అన్నట్టుగా ఉంది. తనను చూడగానే ఎవ్వరూ టక్కున గుర్తుపట్టలేరేమో అన్నంతగా మారిపోయింది.
ప్రస్తుతం 'గుడ్ లక్ సఖి' అనే చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేశ్ చేతిలో పలు తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల కీర్తి సురేశ్ చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోషూట్‌లో ప్రేక్షకులు ముందు చూడని కొత్త కీర్తి సురేశ్ మనకు కనిపిస్తోంది. చాలామంది అసలు తను మన మహానటియేనా అని ఆశ్చర్యపోతున్నారు కూడా.