Kiara Advani : పుష్ప 2 లో కియారా ఐటెం సాంగ్ ?

Update: 2024-06-17 09:46 GMT

పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ( Pushpa 2 ) వస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ( Allu Arjun ), డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, రెండు పాటలు రిలీజ్ కాగా.. వాటిని నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారీటీ రావాల్సి ఉంది. కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న పుష్ప 2లో పుష్ప మాదిరిగానే ఓ స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్ ను మొదట్లో సమంత లేదా జాన్వీ కపూర్ చేస్తారని టాక్ వచ్చింది. కొద్ది రోజుల క్రితం త్రీప్తి డిమీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు కియారా అద్వానీ పేరు సైతం వినిపిస్తోంది. కియారా చేతనే పుష్ప 2 ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి కియారా అద్వానీ ఇందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రష్మిక అదే శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.V6 టాకీస్NEWS

Tags:    

Similar News