Naga Vamsi S : మనసు మార్చుకున్న సితార బ్యానర్

Update: 2025-07-22 11:30 GMT

కొన్నాళ్లుగా స్థిరమైన విజయాలతోదూసుకు పోతోంది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్.డిఫరెంట్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతోంది. ఈ బ్యానర్ నుంచి ఈ నెల 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ విడుదల కాబోతోంది. ఈ మూవీ విషయంలోనే సితార బ్యానర్ మనసు మార్చుకుంది. అలాగని మళ్లీ పోస్ట్ పోన్ ఏం కాలేదు కానీ.. ట్రైలర్ విషయంలో డేట్ మార్చారు.

కింగ్ డమ్ ట్రైలర్ ను ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు. బట్ అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అవతార్ : ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ కూడా వస్తోంది. ఈ రెండూ బిగ్ మూవీస్. వీటి మధ్య కింగ్ డమ్ ట్రైలర్ వస్తే ఆడియన్స్ అటెన్షన్ ను పూర్తిగా సంపాదించలేరు. అందుకే ఆ తర్వాతి రోజున కింగ్ డమ్ ట్రైలర్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించబోతుండటం విశేషం. ఇప్పటి వరకైతే సినిమాపై ఎలాంటి అంచనాలూ లేవు. రిలీజ్ కు పెద్దగా టైమ్ కూడా లేదు. ట్రైలర్ లేట్ గా వస్తే ప్రమోషన్స్ లో కూడా పెద్దగా జోష్ కనిపించదు. అయినా నాగవంశీ ధైర్యం ఏంటో ఆయనకే తెలియాలి.

ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించాడు. సో.. ట్రైలర్ ఒక రోజులు ఆలస్యంగా విడుదల కాబోతోందన్నమాట. 

Tags:    

Similar News