Krishnam Raju : కలల్ని నిజం చేసుకోకముందే కన్నుమూశారు..

Krishnam Raju : కృష్ణంరాజు.. తాను చనిపోయే ముందు కొన్ని ప్రాజెక్టులు పనుల్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు;

Update: 2022-09-11 12:53 GMT

Krishnam Raju : కృష్ణంరాజు.. తాను చనిపోయే ముందు కొన్ని ప్రాజెక్టులు పనుల్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకున్నారు. ఇప్పుడు వీటి గురించే సినీటౌన్‌లో చర్చ జరుతోంది. ప్రభాస్‌తో కలిసి కొన్ని సినిమాలను తెరకెక్కించాలనుకున్నారు. వాటికి అవసరమైన స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేసుకొని ఉన్నారు. కృష్ణంరాజు కెరీర్‌లో భక్తకన్నప్ప ఓ మైలురాయి. ఆ చిత్రంతోనే ఆయన మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాను ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు.

ఛత్రపతిలో 'ఒక్క అడుగు..' అనే డైలాగ్ ఉంటుంది. ఈ ఒక్క అడుగు టైటిల్‌తో కథను సిద్ధం చేశారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలనుకున్నారు. పెద్ద రచయితలను కూడా సంప్రదించారు. సినిమా చేస్తున్నట్లు ప్రకటన విడుదలైనప్పటికీ పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. 'విశాల నేత్రాలు' నవలంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం. దాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకున్నారు. మన ఊరిపాండవులు సినిమాను కూడా ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవడం.. భారీ సినిమాలు ప్రభాస్‌కు రావడంతో ఇవి చేయడానికి అవకాశం దక్కలేదు.

గవర్నర్‌గా పనిచేయాలనుకున్నారు. ప్రభాస్ పెళ్లి చూడాలనుకున్నారు. ఆయన చివరి ఈ రెండు పెద్ద కలలు కూడా నెరవేర్చుకోకుండానే కన్నుమూశారు రెబల్ స్టార్ ప్రభాస్. 

Tags:    

Similar News