Kriti Kharbanda : హంసలా కృతి కర్బందా .. ఫోటోలు వైరల్

Update: 2025-05-07 06:15 GMT

తెలుగు మూవీ ‘బోణి'తో సినీరంగంలోకి అడ్డుగుపెట్టిన హీరోయిన్ కృతి కర్బందా. ఈమూవీ పెద్దగా విజయం సా ధించకపోయినా తన అందం, అభినంయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సరసన 'తీన్ మార్' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆతర్వాత 'చిరు' చిత్రంతో కన్నడలో డెబ్యూ చేసింది. 'గూగ్లీ', 'సూపర్ రంగ' వంటి విజయ వంతమైన సినిమాల్లో నటించింది. తెలుగులో చివరిసారిగా 'బ్రూస్ లీ: 'ది ఫైటర్' లో ఆమె ఐఏఎస్ అభ్యర్థిగా నటించింది. మరోవైపు హిందీ చిత్రాల్లో నూ కృతి తన సత్తా చాటింది. 'గెస్ట్ ఈన్ లండన్', 'పాగల్పంతీ వంటి సినిమాలతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె 15 సంవత్సరాల సినీ ప్రస్థానంలో విభిన్న పాత్ర లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.2024లో కృతి నటుడు పుల్కిత్ సామ్రాట్ ను పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె 'రిస్కీ రోమియో' మూవీతో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా కృతి ఇన్ వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. సూర్యరశ్మిని పీల్చుకునేలా ఓ ఫొటోతో అందరినీ అలరించింది. పూల దుస్తులు ధరించి, తన అందమైన చిరునవ్వును ప్రదర్శిస్తూ 'మీకు మండే మోటివేషన్ వస్తే కామెంట్స్ లో పెట్టండి.. నాకు ఈ రోజంతా హంసలా అనిపిస్తోంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీటిని చూసి అభిమానులు వావ్.. బ్యూటిఫుల్ స్మైల్ అంటూ కృతిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News