కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారి అద్భుతమైన విజయాలు అందుకున్నాడు రాఘవ లారెన్స్. ఛారిటీస్ లోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ముని అనే సినిమాతో మొదలుపెట్టి కాంచన, కాంచన 2, గంగ అంటూ హారర్ మూవీ సిరీస్ తో అదరగొట్టాడు. అన్నీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కావడం విశేషం. రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే మూవీతో హీరోగా మరో విజయం అందుకున్నాడు. తను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు. అలాగే వేరే దర్శకుల సినిమాల్లోనూ హీరోగానూ చేశాడు. బట్ ఫస్ట్ టైమ్ ఓ తెలుగు దర్శకుడితో పనిచేయబోతున్నాడు. అది కూడా హీరోగా అతనికి 25వ సినిమా కావడం విశేషం.
2005లో ఒక ఊరిలో అనే మూవీతో దర్శకత్వం స్టార్ట్ చేసిన రమేష్ వర్మ డైరెక్షన్ లోనే రాఘవ లారెన్స్ 25వ సినిమా రాబోతోంది. రమేష్ వర్మ ఇంతకు ముందు రాక్షసుడు అనే రీమేక్ మూవీతో హిట్ కొట్టాడు. చివరగా రవితేజతో చేసిన ఖిలాడీ వర్కవుట్ కాలేదు. రాక్షసుడుకు సీక్వెల్ తీస్తా అని గతంలో ప్రకటించాడు. మరి అది ఇదేనా లేక కొత్త కంటెంట్ తో వస్తున్నాడా అనేది తెలియదు కానీ ఈ మూవీ పోస్టర్ లో మాత్రం బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్ అని వేశారు. నీలాద్రి ప్రొడక్షన్స్, హవ్విష్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించబోతోన్న సినిమా ఇది. మరి ఈ మూవీతో రమేష్ వర్మ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒకేసారి తెలుగు, తమిళ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడు. ఇన్నాళ్ల నిరీక్షణకూ తెరపడుతుంది.