Laya: 'డీజే టిల్లు' పాటకు సీనియర్ నటి స్టెప్పులు.. మాస్ డ్యాన్స్ అదరగొట్టిందిగా..!
Laya: తన రీల్స్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది లయ.;
Laya: ఫేడవుట్ అయిపోయిన సీనియర్ నటీమణులు మెల్లమెల్లగా సినిమాల్లో తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా కాకపోయినా చాలామంది అలనాటి హీరోయిన్లు ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా లయ కూడా ఈ కేటగిరిలోకే చేరిపోయింది. ఇటీవల లయ పోస్ట్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది.
సీనియర్ హీరోయిన్ లయ ఒకప్పటి యూత్‌కు క్రష్. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో నటిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యింది లయ. ఇక చాలామంది ఇతర హీరోయిన్లలాగానే లయ కూడా కొంతకాలం తర్వాత పర్సనల్ లైఫ్ మీద దృష్టిపెట్టడం కోసం సినిమాలకు దూరమయ్యింది. కానీ ఈమధ్య కాలంలో లయ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ రీల్స్ కూడా షేర్ చేస్తోంది.
ప్రస్తుతం లయ ఫారిన్‌లోనే సెటిల్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా కూడా తనకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కానీ తన రీల్స్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది లయ. ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు స్టెప్పులేస్తూ అదరగొడుతోంది. తాజాగా డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన ఈ సీనియర్ హీరోయిన్ మాస్ డ్యాన్స్ అదరగొట్టేసిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.