విలన్ గ్యాంగ్ లో సైడ్ క్యారెక్టర్స్ లో ఎంటర్ అయ్యి తెలంగాణ స్లాంగ్ తో ఆకట్టుకున్నాడు ఫిష్ వెంకట్.అతని ఫేస్ కట్ కు ఆ స్లాంగ్ బలే సెట్ అవుతుంది. ప్యూర్ డెక్కన్ తెలంగాణ స్లాంగ్ వెంకట్ ది. అందుకే మరింత బ్యూటీఫుల్ గా ఉండేది. ఆ స్లాంగ్ తో విలన్ గ్యాంగ్ నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మెల్లగా కామెడీ రోల్స్ లోనూ ఆకట్టున్నాడు. అలాగే విలన్ గ్యాంగ్ లో ఉన్నా.. 'డైలాగ్ విలన్' గానూ మెప్పించాడు. అంటే ఆ గ్యాంగ్ లో కండలు తిరిగిన విలన్స్ ఎవరున్నా.. వెంకట్ కే డైలాగ్స్ ఉండేవి. అలా మొత్తంగా 100కు పైగా చిత్రాల్లో మెప్పించాడు. కాకపోతే ఆ స్థాయిలో సంపాదించుకోలేకపోయాడు అంటారు. అందుకే అనారోగ్యం కుంగదీసినప్పుడు ఆపన్నుల కోసం అర్రులు చాచాడు. ఆదుకునే వారి కోసం అర్థించాడు. ఏ సహాయమూ అందలేదు. అందిన సాయం అతని ప్రాణాలను కాపాడలేదు. మధ్యలో వారి బాధను కూడా క్యాష్ చేసుకోవాలని కొందరు స్టార్ హీరోల సాయం పేరుతో ఆ హీరోల ఇమేజ్ ను పెంచే సంకుచిత ఎత్తులు పన్నారు. బట్ అవేం అతనికి అందలేదు. చివరికి రెండు కిడ్నీల ఫెయిల్యూర్ తో కన్నుమూశాడు వెంకట్.
ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. మనం రంగుల్లో ఉన్నప్పుడే భవిష్యత్ లో చీకటి అనే రంగు ఆవరించినప్పుడు ఏం చేయాలో అందుకు సిద్ధంగా ఉండాలంటారు. ఎవరినీ అర్థించే స్థితికి రావొద్దు అంటారు. ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్ తో పాటు ఫైనాన్సియల్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ అని ఎంతోమంది చెబుతుంటారు. వాళ్లెందుకు అలా చెబుతారు అనేది ఫిష్ వెంకట్ లాంటి వారి చివరి రోజులను చూస్తే అర్థం అవుతుంది.