Lyca Productions : మూత పడుతున్న భారీ నిర్మాణ సంస్థ

Update: 2025-03-17 07:08 GMT

నిర్మాణ సంస్థలు లేకపోతే సినిమా పరిశ్రమలే లేవు. ప్రతి పరిశ్రమలోనూ చిన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఉంటాయి. కొన్ని ప్రొడక్షన్ హౌస్ ల పేరు చెబితే అత్యంత భారీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఆ గుర్తుకు రావడం అనే కారణంతోనే ఆ సంస్థ మూతపడబోతోందనే వార్తలు వస్తే అంతకంటే విషాదం ఏం ఉంటుంది..? యస్ ఈ కారణంతోనే కోలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ను మూసేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. 2014లో విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన కత్తి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు లైకా ఫౌండర్ సుబాస్కరన్ అల్లీరాజా. మొదట్లో భారీ విజయాలే అందుకున్నాడు.

అయితే కొన్నాళ్లుగా అతి భారీ ఫ్లాపులు చూస్తోందీ బ్యానర్. ముఖ్యంగా లారెన్స్ హీరోగా రూపొందించిన చంద్రముఖి 2, రజినీకాంత్ లాల్ సలామ్, కమల్ హాసన్ ఇండియన్ 2, రజినీకాంత్ వేట్టైయాన్, అజిత్ విడాముర్చి వంటి చిత్రాలు భారీ నష్టాలు తెచ్చాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న ఫేమ్ కూడా పోయింది. దీనికి తోడు భారతీయుడు 2 కోసం శంకర్ తో కేస్ ల వరకూ వెళ్లాల్సి వచ్చింది. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకుని తమ బ్యానర్ నే మూసేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి మోహన్ లాల్ ఎంపూరన్ 2 విడుదల కాబోతోంది. అలాగే ఇండియన్ 3 దాదాపు పూర్తయింది కాబట్టి ఆ చిత్రం వస్తుంది. వీటితో పాటు హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా తర్వాత బ్యానర్ ను మూసేయబోతున్నారు అంటున్నారు. ఏదేమైనా భారీ విజయంతో పరిచయమైన ఈ బ్యానర్ భారీ పరాజయాల కారణంగా షట్ డవున్ అవుతోందన్నమాట.

Tags:    

Similar News