Macherla Niyojakavargam OTT : మాచర్ల నియోజకవర్గం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Macherla Niyoojakavargam OTT : నితిన్ కృతి షెట్టి కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గం థియేటర్లో బిలో ఆవరేజ్‌గా నడిచింది.

Update: 2022-08-17 03:30 GMT

Macherla Niyojakavargam OTT : నితిన్ కృతి షెట్టి కలిసి నటించిన మాచర్ల నియోజకవర్గం థియేటర్లో బిలో ఆవరేజ్‌గా నడిచింది. పేరుకు తగ్గట్లు సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నవారికి నిరాశే ఎదురైంది. మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వినిపించింది. ఆగస్టు 12న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 9న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నట్లు చెబుతున్నారు.అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. థియేటర్లో ఫ్లాప్ అయిన మాచర్ల నియోజకవర్గం.. ఓటీటీలో ఎలా ఆడుతుందో వేచి చూడాలి. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. అంజలి ఐటమ్ సాంగ్ సినిమా మొత్తానికి ఒకేఒక్క హైలైట్ అని చెప్పుకోవచ్చు. 

Tags:    

Similar News