Made In Heaven Season 2 trailer: ఫుల్ డ్రామా, ఎమోషన్, రొమాన్స్ తో ట్రైలర్ రిలీజ్
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్;
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2' ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. తార, అకా శోభితా ధూళిపాలా, కరణ్, అకా అర్జున్ మాథుర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ కూడా ఫుల్ డ్రామా, ఎమోషన్, రొమాన్స్ తో నిండిపోయినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సీజన్ 1లో కనిపించిన నటీనటులే ఈ రెండో సీజన్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. శోభిత, అర్జున్ తోపాటు జిమ్ సర్బా, కల్కి కొచ్లిన్, శశాంక్ అరోరా, శివాంగీ రస్తోగిలాంటి వాళ్లు 'మేడిన్ హెవెన్ సీజన్ 2'లో కనిపించనున్నారు. ఇక మృనాల్ ఠాకూర్, రాధికా ఆప్టే, శిబానీ దండేకర్, సారా జేన్ డయాస్ లాంటి వాళ్లు రెండో సీజన్ లో పెళ్లి కూతుళ్ల పాత్రలు పోషించారు.
ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వెడ్డింగ్ ప్లానర్స్ అయిన తార (శోభిత), కరణ్ (అర్జున్ మాథుర్)ల చుట్టూ తిరిగే కథే ఈ మేడిన్ హెవెన్. రెండో సీజన్ ట్రైలర్ లో ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత బంధాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కనిపించారు. కాగా ఈ సిరీల్ ఆగస్ట్ 10న మేడిన్ హెవెన్ సీజన్ 2 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
ఈ ట్రైలర్ సందర్భంగా మాట్లాడిన శోభిత.. 'మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2'లో తారగా తిరిగి రావడం అద్భుతంగా అనిపిస్తుందని చెప్పారు. నాకు ఈ తార ప్రయాణం మనోహరంగా, సవాలుగా ఉందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రెండవ సీజన్ కోసం చాలా అద్భుతమైన సమయాన్ని గడిపానని, ఈ సీజన్ మా ప్రేక్షకులతో మరింత ప్రతిధ్వనిస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుపటి సీజన్ నుండి ప్రేక్షకుల అంచనాలను సరిపోల్చడానికి, అధిగమించడానికి కొంచెం ప్రెజర్ ఉంది, కానీ దాని గురించి కూడా పాజిటివ్ గానే ఉన్నానన్నారు. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 వీక్షకులను ఆకర్షిస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నానని, ఇది మరపురాని, ఆలోచింపజేసే అనుభవంగా మారుతుందని శోభిత తెలిపారు.
ఎక్సెల్ మీడియా, టైగర్ బేబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ కు జోయా అక్తర్, రీమా కగ్టి, అలంకృత శ్రీవాస్తవ, నీరజ్, నిత్యా మెహ్రా డైరెక్ట్ చేశారు. 2019లో 'మేడిన్ హెవెన్ సీజన్ 1' వచ్చింది. అప్పుడప్పుడే ఇండియాలో హిందీ వెబ్ సిరీస్ లు ప్రారంభమవుతున్న కాలంలో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచీ రెండో సీజన్ కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Money always softens the blow. Make them pay . Get all you can out of it . For the rest , there's whiskey ...
— AKANKSHA ❤️🌊 (@Akank_sha_) August 1, 2023
TARA KHANNA FROM MADE IN HEAVEN #SobhitaDhulipala #ArjunMehra #MadeInHeaven #MadeInHeavenOnPrime#MadeInHeavenSeason2#MadeInHeaven2#MIH #MIH2#ZoyaAkthar pic.twitter.com/Dw4bm7QO2C