Mahesh Bhatt : సుస్మితకు సెల్యూట్.. ఎందుకంటే.. : మహేష్ భట్
Mahesh Bhatt : బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ సుస్మితసేన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
Mahesh Bhatt : బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ సుస్మితసేన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ట్రోల్స్ చేస్తున్నవారిని ఉద్దేశిస్తూ... సుస్మిత బతుకేదో ఆమెను బతకనీయండి.. ఆమె అసాధారణమైన వ్యక్తి, తనకు నచ్చినట్లుగా వుంటుంది అన్నారు. సుస్మిత ఎలాంటి కట్టుబాట్లకు లొంగి ఉండదు. తను స్వేచ్ఛగా జీవిస్తుంది. లలిత్ మోడీ సుస్మితాసేన్ డేటింగ్ విషయం బయటపడడం. ఇప్పుడిది పెద్ద సెన్సేషన్ కావడంతో భట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుస్మిత గుండె ధర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు మహేశ్ భట్. ఇక గతంలో ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాల గురించి చెప్పారు. దస్తక్ షూటింగ్‌లో విక్రమ్ భట్, సుస్మితా ప్రేమించుకున్నారని. దాన్నే సినిమాలో చూపించే ప్రయత్నం చేసానన్నారు.