K Unni Krishnan: నా కొడుకు మరణించలేదు.. ఎంతోమందికి స్ఫూర్తి: మేజర్ సందీప్ తండ్రి

K Unni Krishnan: గుండెల్లోని బాధను గొంతులోనే దిగమింగుకుని కొడుకు జీవితాన్ని ప్రతిబింబించిన చిత్రాన్ని చూసి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రుల కళ్లు చెమర్చాయి.;

Update: 2022-06-03 11:00 GMT

K Unni Krishnan: గుండెల్లోని బాధను గొంతులోనే దిగమింగుకుని కొడుకు జీవితాన్ని ప్రతిబింబించిన చిత్రాన్ని చూసి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రుల కళ్లు చెమర్చాయి. మేజర్ చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు.

సందీప్ జీవితాన్ని ప్రతిబింబించేలా చిత్రాన్ని రూపొందించారని మేజర్ యూనిట్ ని మెచ్చుకున్నారు. చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. నటీనటులు, సినిమాటోగ్రఫీ, కెమెరా పనితనం అన్నీ బావున్నాయని అన్నారు.

తమ బాధను మరిపించేలా ఉందన్నారు. సందీప్ చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు కానీ, అతడి తుది శ్వాస వరకు ప్రజల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నం చేశాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. తన కెరీర్ ని హైదరాబాద్ లోనే ప్రారంభించానని, సందీప్ తో గడిపిన సమయం ఎంతో విలువైనదని అన్నారు.

ఇప్పుడు మై బాయ్స్ (సినిమా టీమ్)తో మంచి సమయం గడుపుతున్నానని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని అన్నారు. మళ్లీ ఇక్కడకు వస్తానని చిత్ర యూనిట్ దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు.

అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 

సినిమా గురించి కే. ఉన్ని కృష్ణన్‌ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో సందీప్‌ తల్లి ధనలక్ష్మీ ఉన్ని కృష్ణన్‌ కన్నిటీపర్యంతమయ్యారు. కాగా సినిమా విడుదలకు ముందు రోజు సందీప్‌ తల్లిని అడవి శేష్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'అంకుల్‌, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్‌ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు.

Tags:    

Similar News