Manchu Vishnu : ఇప్పుడు దానిపై నేనేమీ మాట్లాడలేను : మంచు విష్ణు
Manchu Vishnu : సినిమా టికెట్ రేట్ల వ్యవహారం చల్లారడం లేదు. ఇప్పటికే దీనిపై ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి కలవగా.. మంత్రి పేర్ని నానిని ఆర్జీవి కలిశారు.;
Manchu Vishnu : సినిమా టికెట్ రేట్ల వ్యవహారం చల్లారడం లేదు. ఇప్పటికే దీనిపై ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి కలవగా.. మంత్రి పేర్ని నానిని ఆర్జీవి కలిశారు. ఇప్పుడు తాజాగా వీటిపై స్పందించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఒకరు ఇద్దరు కలిసేవాటిని ఇండస్ట్రీ సమావేశంగా పరిగణించలేమన్నారు. సమస్యపై చర్చిండానికి ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉందన్న విష్ణు.. అందరు చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇండస్ట్రీ తరఫున ఒకరు కలిస్తే అది అసోసియేషన్ మొత్తం వాయిస్ ఎలా అవుతుందని.. ఇన్ డైరెక్ట్‌గా చిరంజీవి భేటీని కౌంటర్ చేశారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లను పెంచితే.. ఏపీలో తగ్గించారని.. రెండు రాష్ట్రాల్లో దీనిపై కోర్టుకు వెళ్లారన్న విష్ణు.. దీనిపై నేను ఏమీ చెప్పలేనని అన్నారు. చిరంజీవి పైనా విష్ణు నేరుగా స్పందించారు. ఆయన ఇండస్ట్రీ లెజెండ్ అన్న విష్ణు.. తన తండ్రితోపాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంతా ఇండస్ట్రీ పెద్దలే అన్నారు.
ఏదైనా సమస్య ఉంటే పెద్దలంతా కలిసి చర్చిస్తారని అన్నారు. వైఎస్ హయాంలో దాసరి నారాయణరావు కలిస్తే సినీ పరిశ్రమ కోసం జీవో ఇచ్చారని.. అదే జీవోను కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నలుగురి కోసం రద్దు చేశారని విష్ణు అన్నారు. ఆ జీవోపై సమాధానం ఇస్తే.. తాను జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్పందిస్తా అన్నారు.