Kannappa Sets : మంచు విష్ణు 'కన్నప్ప' సెట్లో బాహుబలి

Update: 2024-05-09 09:49 GMT

భారీ తారాగణంతో టాలీవుడ్ లో బజ్ క్రియేట్ చేసిన సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా 'కన్నప్ప'ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్లతో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. అక్షయ్‌కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. 'కన్నప్ప'లో ప్రభాస్ నందీశ్వరుడిగా నటించబోతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ 'కన్నప్ప' సెట్లో కూడా అడుగు పెట్టారు. ఈనెల 7 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

మరో నాలుగు రోజులు ఈ షూటింగ్ కొనసాగే అవకాశం ఉంది. దాంతో… 'కన్నప్ప' దాదాపుగా పూర్తవుతుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ రోజులు సమయం కేటాయించారు.

Tags:    

Similar News