Sai Pallavi : మణిరత్నం కోరుకున్న సాయి పల్లవి

Update: 2025-12-08 10:16 GMT

ఫైనల్ గా మణిరత్నం డైరెక్షన్ లో సాయి పల్లవి నటించబోతోంది. యస్.. ఈ కాంబినేషన్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు మణిరత్నం. గతంలో కూడా ఆమెను అడిగాడు అతను. బట్ ఆమె నో చెబుతూ వస్తోంది. చివరికి ఆమె కోరుకున్న విధంగానే స్టోరీ సెలెక్ట్ చేశాడు మణిరత్నం. నిజానికి మణిరత్నంను సాయి పల్లవి కాట్రు వేలియిదై మూవీలోనే తీసుకోవాలనుకున్నాడు. ఆమెకు కథ చెప్పాడు. బట్ సాయి పల్లవి ఆ స్టోరీకి నో చెప్పింది. కట్ చేస్తే కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరి నటించింది. చెలియా అనే తెలుగు టైటిల్ తో వచ్చిన మూవీ పోయింది. తర్వాత పొన్నియన్ సెల్వన్ కోసం కూడా సాయి పల్లవిని అడిగాడు. తను అప్పుడు కూడా నో చెప్పింది. ఫైనల్ గా ఓకే చేసింది.

ఇక ఈ మూవీ జనవరిలో ఓపెనింగ్ జరుపుకోబోతోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. విశేషం ఏంటంటే ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించబోతున్నాడు. ముందుగా శింబుకు ఆ పాత్ర గురించి చెప్పారు. అప్పుడు సాయి పల్లవికి చెప్పిన మార్పుల వల్ల అతను నో చెప్పాడు. కట్ చేస్తే విజయ్ సేతుపతి ఓకే చేశాడు. మొత్తంగా సాయి పల్లవికి కథ నచ్చాలి అంటే మణిరత్నం కూడా అనేక రకాలుగా తంటాలు పడటం మాత్రం అర్థం అవుతోంది. మామూలుగా మణిరత్నం మూవీ అంటే ఏ హీరోయిన్ అయినా వెంటనే ఎగిరిగంతేస్తుంది. బట్ సాయి పల్లవి మాత్రం అతన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. ఫైనల్ గా ఆ కథను ఓకే చేయించుకుంది. అదీ మేటర్. 

Tags:    

Similar News