మాస్ మహారాజ్ రవితేజ కొన్నాళ్లుగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నాడు. ఈ డెకేడ్ లోనే రవితేజ పరిస్థితే అలా ఉంది. ఒక హిట్టు నాలుదైదు ఫట్ లు అన్నట్టుగా ఉంది కెరీర్. మరీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. 2021లో వచ్చిన క్రాక్ తర్వాత 8 సినిమాలు చేశాడు. వీటిలో ధమాకా, వాల్తేర్ వీరయ్య మాత్రమే హిట్స్. మిగతా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ వచ్చన్ మూవీస్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అనిపించుకున్నాయి. ఈ విషయంలో రవితేజ పై విమర్శలు కూడా వచ్చాయి. కేవలం తక్కువ రోజులు, ఎక్కువ రెమ్యూనరేషన్ పైనే దృష్టి పెడుతున్నాడు తప్ప.. కథ,కంటెంట్ పై ఫోకస్ చేయడం లేదు అని ఫ్యాన్స్ లోనూ ఓ నిరుత్సాహం ఉంది.
ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. ధమాకా తర్వాత రవితేజ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా కనిపిస్తోంది. సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గానే ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ఈ మూవీని సంక్రాంతి బరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం షూటింగ్ లోనే గాయపడ్డాడు రవితేజ. ఆ కారణంగా రెండు నెలలకు పైగా రెస్ట్ అవసరం అయింది. దీంతో మే 9న విడుదల చేస్తారు అని టాక్.
ఇక ఈ చిత్రం నుంచి ఓ పర్ఫెక్ట్ టీజర్ ను రెడీ చేస్తున్నారట. ఈ నెల 26న రవితేజ బర్త్ డే ఉంది. ఆ బర్త్ డే స్పెషల్ గా ఈ టీజర్ ను విడుదల చేయొచ్చు అంటున్నారు. ఇప్పటి వరకూ మాస్ జాతర నుంచి ఏ కంటెంట్ రాలేదు. టీజర్ తో సినిమాను లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. సో.. ఫ్యాన్స్ కోసం మాస్ రాజా మూవీ నుంచి బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోందనుకోవచ్చు.