నా అన్వేషణ అన్వేష్ మీద హిందువులంగా ఫుల్ సీరియస్ గా ఉన్నారు. శివాజీ హీరోయిన్ల బట్టల మీద కామెంట్లు చేస్తే.. దాన్ని పట్టుకుని అన్వేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సీతాదేవిని, ద్రౌపదిని అవమానించాడు. హిందువులను బండబూతులు తిట్టాడు. హిందూ యువత రేపులు చేస్తోందంటూ వివాదాస్పద కామెంట్లు చేశాడు. తెలుగు వారిని ఘోరంగా అవమానించాడు. ఇంత చేసిన అన్వేష్ మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక ఫిర్యాదులు వచ్చాయి. అటు పంజాగుట్టలో కరాటే కల్యాణి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతని ఇన్ స్టా గ్రామ్ ఐడీ వివరాలు ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ కు లెటర్ రాశారు. అలాగే ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెళ్లకు కూడా లేఖలు రాస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మొదట అన్వేష్ ఛానెళ్లను బ్యాన్ చేయించి ఆ తర్వాత అతన్ని ఇండియాకు రప్పించి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంట పోలీసులు. ఎందుకంటే అన్వేష్ వ్యాఖ్యలు సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతినేలా ఉన్నాయి. కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్లు అటు హిందూ సంఘాల నుంచి భారీగా వస్తున్నాయి. వీలైనంత త్వరగా అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటున్నారు. దీంతో పోలీసులు కూడా ఆ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డికి హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ మీద ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. అతన్ని ఇప్పటికే లక్షల మంది సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు. యూట్యూబ్ లో లక్షల మంది అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా సరే అన్వేష్ కు ఇసుమంతైనా పశ్చాత్తాపం లేదు. అతను తన వ్యాఖ్యలపై మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పట్లేదు. అందుకే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారంట. త్వరలోనే అతనికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.