Meenakshi Chaudhary : రెమ్యూనరేషన్ పెంచిన మీనాక్షి చౌదరి

Update: 2024-06-07 05:52 GMT

మహేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. ఇందులో చేసింది చాలా చిన్న పాత్రే అయినా.. అది ఈ బ్యూటీకి మంచి మైలేజ్ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ లో మీనాక్షికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇచ్చట వాహనములు నిలుపరాదుతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ మూవీతో పర్వాలేదనిపించింది. అనంతరం ఖిలాడి, హిట్ 2 లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో దళపతి విజయ్ తో ఈ బ్యూటీ జత కడుతోంది. ఇక విజయ్ లాంటి హీరోతో 'అవకాశం రావడంతో కోలీవుడ్ లో ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత అక్కడ కూడా మీనాక్షికి వరుస అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. వరుస సినిమా అవకాశాలు వస్తుండటంతో.. మీనాక్షి తన రెమ్యునరేషన్ ను పెంచేసిందట. మొన్నటిదాకా కోటికి అటు ఇటుగా తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు 2 కోట్ల పైగానే డిమాండ్ చేస్తుందట. ప్రొడ్యూసర్స్ కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. కాగా అందం, అభినయంతో మెప్పిస్తున్న మీనాక్షి.. సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

Tags:    

Similar News