ఇచట వాహనాలునిలుపరాదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి మీనాక్షి చౌదరి. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించింది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మీనాక్షి. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ఎన్సి24 మూవీతో పాటు నవీన్ పొలిశెట్టి సరసన మరో సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది మీనాక్షి చౌదరి. పోస్టులు పెడుతూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. పర్పుల్ కలర్ శారీ కట్టుకొని మెరిసిపోయింది. చాలా నాజుగ్గా ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీనాక్షి అందానికి ఫిదా అవుతున్నారు. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మురిపిస్తోన్న ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘స్త్రీ’, ‘మిమీ’ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజన్ రూపొందిస్తున్న ఓ ప్రాజెక్టులో మీనాక్షి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.