MAA Elections 2021: పరిస్థితులు మారుతుంటాయి.. రెడీ అవ్వాలి అన్న చిరు మాటలకు అర్థమేంటి?
MAA Elections 2021: పోలింగ్ సందర్భంగా మా ఎన్నికలపై ఒక్కొక్క సెలబ్రిటీ స్పందించడం మొదలుపెట్టారు.;
MAA Elections 2021: పోలింగ్ సందర్భంగా మా ఎన్నికలపై ఒక్కొక్క సెలబ్రిటీ స్పందించడం మొదలుపెట్టారు. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి మా ఎన్నికలపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఓటు వేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కూడా తన భావాలను పంచుకున్నారు. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాశ్ రాజ్‌కే దక్కింది. మెగా బ్రదర్స్ ఇద్దరు ప్రకాశ్ రాజ్‌కే తమ మద్దతు అని పలుమార్లు వ్యక్తం చేసారు.
జూబ్లీ హిల్స్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి అక్కడ మీడియాతో కాసేపు మాట్లాడారు. మా ఎన్నికల వల్ల సోషల్ మీడియాకు చాలా హాయిగా మంచి మెటీరియల్ దొరికిందన్నారు. ఒక్కొక్కసారి పరిస్థితులు మారుతుంటాయి. అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని చిరంజీవి అన్నారు.