Chiranjeevi : రెబల్ స్టార్‌కి మెగాస్టార్ బర్త్‌డే విషెస్..!
Chiranjeevi : రెబల్ స్టార్ కృష్ణంరాజు. గురువారం(జనవరి 20న) ఆయన 81వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు.;
Chiranjeevi : రెబల్ స్టార్ కృష్ణం రాజు. గురువారం(జనవరి 20న) ఆయన 81వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు ఆయనకీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కృష్ణంరాజుకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'సోదర సమానుడు, తెలుగు చిత్రపరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా అడుగు పెట్టిన ప్రతి రంగంలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన కృష్ణం రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
Happy Birthday #KrishnamRaju garu !💐 pic.twitter.com/VgyQvjIyN4
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2022