న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ, బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ లభించింది. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తు న్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 1950 జూన్ 16న బెంగాల్ లో జన్మించిన మిథున్ చక్రవర్తి 1976లో మృగయా అనే హిందీ మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన నటనకు ఇప్పటికే మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. ఇక 2004 లో పద్మవిభూషణ్ పురస్కారం సైతం లభించింది. తాజాగా సినిమాల్లో అత్యంత ము ఖ్యమైన దాదాసాహె బ్ ఫాల్కే అవార్డు దక్కింది.
పశ్చిమబెంగాల్‌కు చెందిన మిథున్ చక్రవర్తి.. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో యాక్ట్ చేసి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా సహాయనటుడు, విలన్‌గా కూడా ఆయన ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు. 1976లో ‘మృగాయ’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘ముక్తి’, ‘బన్సారీ’, ‘అమర్‌దీప్’, ‘ప్రేమ్ వివాహ్’, ‘భయానక్’, ‘కస్తూరి’, ‘కిస్మత్’, ‘మే ఔర్ మేరా సాథి’, ‘సాహాస్’, ‘వాంటెడ్’, ‘బాక్సర్’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్’, ‘దలాల్’, ‘భీష్మ’, ‘సుల్తాన్’, ‘గురు’, ‘కిక్’, ‘బాస్’, డిస్కోడాన్సర్ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.