Mohan Babu : చిరంజీవి మంచి నటుడు.. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు..!
Mohan Babu : చిరంజీవి మంచి నటుడు.. వ్యక్తిగతంగా అతనిపై తనకి ఎలాంటి చెడు అభిప్రాయం లేదని అన్నారు సినీ నటుడు మెహన్‌బాబు..;
Mohan Babu : చిరంజీవి మంచి నటుడు.. వ్యక్తిగతంగా అతనిపై తనకి ఎలాంటి చెడు అభిప్రాయం లేదని అన్నారు సినీ నటుడు మెహన్‌బాబు.. బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోలో పాల్గొన్న మోహన్ బాబు.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణను ఎదురు ప్రశ్నించి సమాధానాలు కూడా రాబట్టారు. ఈ షోలో మోహన్ బాబుతో పాటుగా మంచు లక్ష్మి, విష్ణు కూడా సందడి చేశారు.
ఇక ఈ షోలో మోహన్ బాబు... చిరంజీవి గురించి మాట్లాడుతూ... 'చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. వ్యక్తిగతంగా అతనిపై ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్యగారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశా. సురేఖ నాకు సోదరిలాంటిది. అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు' అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
కాగా ప్రస్తుతం సన్ అఫ్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారాయన. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తుండగా డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.