Raviteja : మిస్టర్ బచ్చన్ సాంగ్.. ఒన్స్ మోర్ అనేలా ఉందా..?

Update: 2024-07-25 12:36 GMT

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ నుంచి మరో పాట విడుదల చేశారు. హరీశ్ శంకర్ డైరక్ట్ చేస్తోన్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఆగస్ట్ 15న విడుదల కాబోతోందీ మూవీ. ఇంతకు ముందు వచ్చిన రొమాంటిక్ సాంగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈసారి ఓ మంచి మాస్ సాంగ్ తో వస్తున్నామని టీమ్ అంతా బాగా హడావిడీ చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ స్వరపరిచాడు. మంగ్లీ, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు.

‘బొమ్మా సోకులో బొంబాయి జాతరే.. బచ్చన్ గొంతులోన బప్పీ లహరే.. ఉస్కోలే అంటే చాలు డిస్కోలా మోతలే.. తెల్లార్లూ చల్లారని గాన కచేరే.. తెలుగు తమిళ్ హిందీ వలపు జుగల్ బందీ... ’ అంటూ మేల్ వర్సన్ లో స్టార్ట్ అయిన సాంగ్ లో అంత ఊపు కనిపించలేదు అనే చెప్పాలి. పైగా ఈ ట్యూన్ కూడా చాలాసార్లు విన్నట్టుగానే ఉంది. పదాల మాయాజాలం ఉంది కానీ.. ట్యూన్ లో ఆ మ్యాజిక్ కనిపించలేదు.

ఇక ఫీమేల్ వెర్సన్ లో వచ్చిన ‘‘రెప్పల్ డప్పుల్ల సప్పుల్లు కొట్టాలిలే.. నా గాజులూ గజలే పాడాలిలే.. కిర్రంటూ మంచాల కోరస్ లే.. ప్రేక్షకులు మల్లేపూలే.. ’ అనే లైనింగ్ బావుంది. ఆ తర్వాత హూక్ లైన్ లాగానే ఒన్స్ మోర్ మోర్ మోర్ మూసేయ్ డోర్ డోర్ డోర్ అంటూ సాగే లైన్స్ కాస్త జోష్ గా ఉన్నాయి. ఓవరాల్ గ చూస్తే ఈ పాట వాళ్లు చెప్పినంత మాసీ నంబర్ లా అయితే లేదు. సాహిత్యం మిక్స్ డ్ గా ఉండటం ట్యూన్ రొటీన్ గానే కనిపించడం వల్ల సాధారణ పాటలానే ఉందని చెప్పాలి.

ఇక 2018లో వచ్చిన హిందీ రైడ్ మూవీకి ఇది రీమేక్. 1980ల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మరి ఒరిజినల్ తో పోలిస్తే దర్శకుడు అనేక మార్పులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి మార్పులు మంచివా కాదా అనేది ఆగస్ట్ 15న తేలిపోతుంది.

Tags:    

Similar News