బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ కు పొగడ్తల మాల వేసింది నటీమణి మృణాల్ ఠాకూర్. కంగన నటించి దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమాను ఇటీవలే వీక్షించినట్టు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది మృణాల్. తన తండ్రితో కలిసి 'ఎమర్జెన్సీ' సినిమా చూశానని తెలిపింది. ఆ సినిమా అందించిన అనుభూతి నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాని చెబుతోంది. కంగనా అభిమాని గా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడడం ఎంతో సంతోషంగా ఉందంటోంది. ఇది ఆమెకు అద్భుతమైన విజయమని తెలిపింది. 'గ్యాంగ్ స్టర్ ' నుంచి 'క్వీన్' వరకు.. 'తను వెడ్స్ మను' నుంచి ‘మణికర్ణిక', 'తలైవి' వరకు.. ఇప్పుడు తాజాగా 'ఎమర్జెన్సీ' కంగన ఇట్లా నటనలో సరిహద్దులు దాటుతూ అద్భుతమైన ప్రతిభతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారంటోంది. ఈ సినిమాలోని ప్రతి అంశం తనను ఆకట్టుకున్నాయని పేర్కొంది. కెమెరా యాంగిల్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిదీ నన్ను ఆకర్షించాయని తెలిపింది. ఈ చిత్రంతో కంగనా దర్శకురాలి గానూ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారని, స్క్రీన్ప్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయంటూ కితాబిచ్చింది మృణాల్. సినిమాపై మీకున్న అంకితభావం ప్రతి ఫేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తుందంటూ కంగనను ఉద్దేశించి పేర్కొన్నారు. ఎవరైనా ఈ సినిమాను చూడ కపోతే కచ్చితంగా చూడాలని, భారతీయులంతా తప్పక చూడాల్సిన చిత్రమంటూ ప్రమోట్ చేసింది మృణాల్.