Naga Chaitanya: నాగచైతన్య కారుకు జరిమానా విధించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్..
Naga Chaitanya: తాజాగా హీరో అక్కినేని నాగచైతన్య కారుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.;
Naga Chaitanya: రూల్ ఫర్ ఆల్ అంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సెలబ్రెటీలు, వీఐపీలు అని లేదు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉందా.. ఫైన్ కట్టాల్సిందే. తాజాగా హీరో అక్కినేని నాగచైతన్య కారుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ ఉండటంతో 700 రూపాయలు ఫైన్ వేశారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగించారు. ఫైన్ వేసే సమయంలో నాగచైతన్య.. కారులోనే ఉన్నారు.