Naga Chaitanya: నాగచైతన్య రెండో పెళ్లి..? అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ..?
Naga Chaitanya: నాగచైతన్య.. తన సహ నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.;
Naga Chaitanya (tv5news.in)
Naga Chaitanya: టాలీవుడ్‌లో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే అక్కినేని హీరో నాగచైతన్య కూడా విడాకుల తర్వాత సింగిల్‌గా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉండగా.. మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్య.. తన సహ నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోతున్నట్టుగా ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో వీరు విడాకుల విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అయితే అలా ప్రకటించిన కొంతకాలం వరకు వీరిద్దరు మళ్లీ కలుస్తారేమో అని ఆశగా ఎదురుచూశారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా పోయాయి. ఇంతలోనే నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ టాక్ వినిపిస్తోంది.
విడాకులు అయ్యి చాలా నెలలు కావస్తుండడంతో నాగచైతన్య మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ఒక హీరోయిన్‌తో అని కూడా కొందరు నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని నాగార్జున అన్నట్టు సమాచారం. నాగచైతన్య, అఖిల్‌కు ఒకేసారి పెళ్లి చేయాలని నాగార్జున అనుకుంటున్నాడు అంటూ వస్తున్న రూమర్స్‌ను నాగ్ కొట్టిపారేసినట్టు టాక్.