Naga Chaitanya : సమంతో విడాకులుపై నాగ చైతన్య కామెంట్స్

Update: 2025-02-08 05:00 GMT

అక్కినేని నాగ చైతన్య, సమంత.. ఈ రెండు పేర్లూ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటాయి. సమంత ఫస్ట్ మూవీ హీరో నాగ చైతన్య. ఏ మాయ చేశావె నుంచి ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. ఈ మూవీ చైతూకు ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఇద్దరూ ఆటో నగర్ సూర్య,మనం చిత్రాల్లో కలిసి నటించారు.వీటిలో ఆటోనగర్ సూర్య ఎప్పుడో పూర్తయినా మనం ముందుగా విడుదలైంది. మొత్తంగా మనం తర్వాత నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే ఈ జంట అన్ని పరిశ్రమల్లో హాట్ టాపిక్ అయింది. తర్వాత పెళ్లి చేసుకుని నేషనల్ మీడియాలోనూ హెడ్ లైన్స్ గా మారారు. నాలుగేళ్ల తర్వాత సడెన్ గా విడిపోతున్నారు అనే వార్త చాలామందిని షాక్ కు గురి చేసింది.

ఇంటర్నల్ గా ఏమున్నాయో ఎవరికీ తెలియదు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోయారు. ఎవరి లైఫ్ వాళ్లు చూసుకున్నారు. ఇన్నాళ్లైనా ఇంకా వీరి విడాకులు వ్యవహారం ఎప్పుడూ లైమ్ లైట్ లోనే ఉంటోంది. తాజాగా తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్యకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి అతను చెప్పిన సమాధానం చాలామందిని ఆకట్టుకుంటోంది.

"నేను బ్రోకెన్ ఫ్యామిలీ(నాగార్జున మొదటి భార్య చైతన్య తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడు)నుంచే వచ్చాను.విడాకులు తీసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయానికి రావడానికి ముందు వెయ్యి సార్లు ఆలోచించాను.ఆ తర్వాతే ఇద్దరం విడిపోయాం. అప్పటి నుంచి ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటున్నారు. ఇది ఆగుతుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ నేను ముందుకొచ్చి.. ఇదీ జరిగింది అని చెప్పినా.. మళ్లీ దాన్నుంచి కొత్త రాతలు మొదలవుతాయి. సో.. ఇప్పుడు మేం ఎవరి బ్రతుకులు వాళ్లం బ్రతుకుతున్నాం. నాకు మళ్లీ ప్రేమ దొరికింది. పెళ్లి చేసుకున్నా. సో.. మేం ఏం చెప్పినా ఇవి ఆగవు. రాసే వాళ్లే ఆపాలి.." అని చెప్పాడు.

ఏదేమైనా వీళ్లు విడిపోయారు.ఇందులో తప్పొప్పులు ఏంటనేది సమాజం నిర్ణయం చేయకూడదు. అన్నీ ఆలోచించుకునే వాళ్లు విడిపోయారు. వారి ప్రైవసీని గౌరవించడం సమాజం బాధ్యత. జస్ట్ సెలబ్రిటీ కపుల్ కాబట్టే వారి గురించి పదే పదే మాట్లాడుతున్నారు అంతే. అవి ఇకనైనా ఆపితే బెటర్. 

Tags:    

Similar News