Naga Chaitanya : సమంతకు చై కౌంటర్..
Naga Chaitanya : గతంలోకంటే తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు నాగచైతన్య చెప్పారు.;
Naga Chaitanya : ఇటీవళ కాఫీ విత్ కరణ్ షోలో సమంత సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నాగ చైతన్యను భర్తగా కాదు మాజీ భర్త అనాలని కరణ్ జోహర్‌కు చెప్పింది. విడాకుల తరువాత చై నుంచి ఎలాంటి భరణం కూడా తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఒకే గదిలో నాగచైతన్యను తనను బంధిస్తే అక్కడ ఆయుధాలు లేకుండా చూడాలని కూడా తేల్చి చెప్పింది. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
నాగచైతన్య థాంక్యూ సినిమాకు సంబంధించిన ఇంటర్వూలో ఈ వైరల్ పై పరోక్షంగా స్పందించారు. గతంలోకంటే తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఇంకా హ్యాపీగా గడుపుతున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇవి సమంత కామెంట్స్‌కు చై కౌంటర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.