Naga Chaitanya Samantha Divorce: వెబ్ సిరీస్ కోసం అనుకున్నారు.. కానీ అదే నిజమయింది

Naga Chaitanya Samantha Divorce: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం చైతూ సమంతల విడాకులు.;

Update: 2021-10-02 14:52 GMT

Naga Chaitanya Samantha Divorce: ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం చైతూ సమంతల విడాకులు. అక్టోబర్ 7న వీరిద్దరు వారి విడాకుల గురించి ఒక క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ అనౌన్స్‌మెంట్ ఈరోజే వచ్చేసింది. ముందుగా చైతూ తన ట్విటర్‌లో విడాకుల సంగతి వెల్లడించాడు. తర్వాత సమంత కూడా తన సోషల్ మీడియాలో అదే విషయాన్ని పోస్ట్ చేసింది. అయితే ఇదంతా వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని కొందరు కొట్టిపారేసారు. 

సినీ ప్రపంచంలో నటీనటులు తరువాత చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి ఎలాంటి ప్రమోషన్ స్టంట్లు చేయడానికైనా వెనకాడట్లేదు. అందుకే చైతూ, సమంత విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఇది 'డైవర్స్' అనే వెబ్ సిరీస్‌కు వారు చేస్తున్న ప్రమోషన్ అనుకున్నారంతా. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో ఓటీటీలో అడుగుపెట్టిన సమంత ఈసారి మరో సిరీస్ కోసం ప్రమోషన్లు మొదలుపెట్టింది అనుకున్నారు. కానీ అదంతా ప్రమోషన్ కాదని నిజమే అని తాజాగా స్పష్టమయింది.


Tags:    

Similar News