అక్కినేని నాగ చైతన్య రెట్టించిన ఉత్సాహంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత తండేల్ 100 కోట్లు కొట్టడం.. ఇది తనకు ఫస్ట్ హండ్రెడ్ కావడంతో ఆనందం డబుల్ అయింది అతనికి. ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో తన 24వ సినిమాకు సిద్ధం అవుతున్నాడు. మిథికల్ ఫాంటసీ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందబోతోందట. కార్తీక్ వర్మ ఆల్రెడీ విరూపాక్షతో 100 కోట్ల క్లబ్ లో ఉన్నాడు. విరూపాక్ష పూర్తిగా డైరెక్టర్స్ మూవీ. కాబట్టి అతనిపై భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. ఇటు నాగ చైతన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. పైగా ఇప్పుడు ఈ తరహా సబ్జెక్ట్స్ కు మంచి డిమాండ్ ఉంది. సో.. ప్రస్తుతం నాగ చైతన్య కాన్ సెంట్రేషన్ అంతా ఈ మూవీపైనే ఉంది. అయితే కొన్ని రోజులు క్రితం అతను ‘మయసభ’అనే చిత్రం చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు అన్నారు. ఆల్రెడీ దేవా కట్టా డైరెక్షన్ లో చైతూ ఆటోనగర్ సూర్య అనే సినిమా చేసి ఉన్నాడు కాబట్టి ఇది నిజమే అనుకున్నారు చాలామంది. అలాగే ఈ మయసభ అప్డేట్స్ కూడా అడుగుతున్నారు.
ఇవి కాస్త ఎక్కువ కావడంతో నాగ చైతన్య టీమ్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. మయసభ అనే సినిమా చైతూ చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఒట్టి పుకారు మాత్రమే అని కొట్టి పడేశారు. సో.. నాగ చైతన్య మయసభ అనేది జస్ట్ గాసిప్ అన్నమాట.