Namrata Shirodkar: నమ్రత నట జీవితానికి ఎందుకు స్వస్తి చెప్పింది.. పెళ్లైన 17 ఏళ్ల తర్వాత..
Namrata Shirodkar: అయితే నమ్రత తన కెరీర్‌లో పీక్‌కి చేరుకుంటున్న సమయంలో సౌత్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని నట జీవితానికి గుడ్‌బై చెప్పింది.;
Namrata Shirodkar: నటి నమ్రతా శిరోద్కర్ 1993లో 'మిస్ ఇండియా' టైటిల్‌ను గెలుచుకుని సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె సల్మాన్ ఖాన్ 'జబ్ ప్యార్ కిసీ సే హోతా హై'లో చిన్న పాత్రలో నటించి తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 'వాస్తవ్', 'కచ్చే ధాగే' వంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల కారణంగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే నమ్రత తన కెరీర్‌లో పీక్‌కి చేరుకుంటున్న సమయంలో సౌత్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని నట జీవితానికి గుడ్‌బై చెప్పింది.
నమ్రత తీసుకున్న నిర్ణయం అభిమానులను షాక్‌కి గురి చేసింది. కెరీర్ పీక్ కి చేరుకున్న నమ్రత ఎందుకు పెళ్లి చేసుకుందో, సినిమా ఇండస్ట్రీని ఎందుకు వదిలేసిందో ఎవరికీ తెలియదు. పెళ్లై 17 ఏళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దీని వెనుక అసలు కారణాన్ని బయటపెట్టింది నమ్రత.
నమ్రత కెరీర్ కాకుండా పెళ్లి ఎందుకు ఎంచుకుంది?
నమ్రత, మహేష్ బాబు తొలిసారి 2000లో 'వంశీ' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఐదేళ్ల తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం నమ్రత సినీ పరిశ్రమ నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబాన్ని చూసుకోవడంపై దృష్టి సారించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ " నాకు ప్రణాళికలు లేవని నేను ఎప్పుడూ చెబుతాను. ఏది జరిగినా ఆటోమేటిక్‌గా జరిగిపోయింది. అయితే నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని మాత్రం చెప్పగలను, ఆ నిర్ణయాలతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. నేను నటిగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు చాలా బద్ధకంగా ఉండేదాన్ని. మోడలింగ్‌తో విసుగు చెంది నటన వైపు మళ్లాను" అని అన్నారు. కానీ పెళ్లైన తరువాత దానికి కూడా స్వస్తి చెప్పాను అని నమ్రత ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"పనిని సీరియస్‌గా తీసుకుంటే ఈ రోజు జీవితం భిన్నంగా ఉంటుంది"
''మోడలింగ్ తర్వాత నేరుగా యాక్టింగ్‌లోకి అడుగుపెట్టాను. నేను పనిని ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు, నటనను సీరియస్‌గా చూడటం ప్రారంభించినప్పుడు నేను మహేష్‌ని కలిశాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను నా పనిని సీరియస్‌గా తీసుకున్నట్లయితే, నా జీవితం చాలా భిన్నంగా ఉండేది. కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు. మహేష్‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటి. ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. వివాహం, మాతృత్వం చాలా భిన్నమైన అనుభవాలు. నేను దానిని దేనికోసం మార్చను అని నమ్రత తెలిపారు.