టైటిల్ చూసి కంగారు పడ్డారా.. ఇది చదివితే అది నిజం అని మీకే అనిపిస్తుంది.. యస్.. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ చూస్తోంటే మహేష్ బాబును ఆయన భార్య అమ్మకానికి పెట్టిందనే చెప్పుకుంటున్నారు. లేకపోతే.. ఆనాటి డేరింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణగారి వారసుడుగా వచ్చి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. అని అభిమానులంతా గర్వంగా చెప్పుకుంటోన్న హీరో. నటుడుగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోస్ లో ఒకడు. అందం అనే మాటకు పేటెంట్ రైట్స్ ఉన్న హీరో. రికార్డులు బద్ధలు కొట్టిన సినిమాలు చాలానే ఉన్న స్టార్. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న సూపర్ స్టార్.. అతి త్వరలోనే కాబోయే ప్యాన్ ఇండియా స్టార్. రాజమౌళితో చేస్తోన్న సినిమాతో ఆ మోస్ట్ హ్యాండ్సమ్ కటౌట్ ప్రపంచం మొత్తాన్ని ఫిదా చేయబోతోంది. అలాంటి కటౌట్ తో ఆయన భార్య చేస్తోన్న, చేయిస్తోన్న పనులు చూస్తే నిజంగానే ఆమె అతన్ని అమ్మకానికి పెట్టిందా అనే అనుమానం కలిగితే తప్పేం లేదు.
తెలుగులో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న హీరోస్ లో మహేష్ బాబు ఒకడు. కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. గుంటూరు కారం టాక్ ఎలా ఉన్నా.. కమర్షియల్ గా హిట్టే అని చెప్పాలి. ఇప్పుడు రాజమౌళితో మూవీ టాలీవుడ్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న కాంబినేషన్. రాజమౌళి ఇప్పటి వరకూ చేసిన హీరోలతో పోలిస్తే మహేష్ బెస్ట్ కటౌట్. అలాంటి వాడితో ఎలాంటి మూవీ చేయబోతున్నాడో ఊహలకు కూడా అందదు. అలాంటి మహేష్ ను నమ్రత చీరల దుకాణాల ఓపెనింగ్ లకు తీసుకువెళుతోంది.
ఇప్పటికే మహేష్ తో యాభై వరకూ ఎండార్స్ మెంట్స్ చేయిస్తోంది నమ్రత. నిజానికి యాడ్స్ అనేవి మహేష్ ఛాయిస్ కాదంటారు. నమ్రత కావాలనే ఆయనతో ఇవన్నీ చేయిస్తుందనే వారూ ఉన్నారు. తెలుగులో మరే హీరో చేయనన్ని యాడ్స్ మహేష్ చేస్తున్నాడు. ఇందులో బాగా పేరున్న కార్పోరేట్ ప్రాడక్ట్స్ తక్కువే. అయినా ఇన్ని యాడ్స్ అంటే అదంతా నమ్రత ఛాయిస్ అంటారు. చివరికి ఆయనతో చీరల దుకాణాల యాడ్స్ కూడా చేయిస్తోందంటే ఇంక చెప్పేదేముంది. మామూలుగా రాజమౌళితో సినిమా అంటే చాలా టైమ్ పడుతుంది. మధ్యలో మరో సినిమా చేయడానికి లేదు. అందుకే అతనితో ఇలా చీప్ యాడ్స్ కూడా చేయిస్తుందంటున్నారు. సినిమాలకు గ్యాప వస్తోంది కాబట్టి ఆ సంపాదనను ఇలా మహేష్ ను అమ్మకానికి పెట్టి మరీ సంపాదిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల మేటర్ ఏమో కానీ.. యాడ్స్ విషయంలో మహేష్ భార్య చేతిలో కీలుబొమ్మలా మారాడు అంటున్నారు. ఆమె వరస చూస్తుంటే మహేష్ కు 5 - 10 లక్షలు ఇచ్చినా ఒక యాడ్ చేయించేలా ఉందనే కమెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఓ వైపు ఆయనేమో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోంటే ఈవిడేమో.. పదీ పరకకు ఆయనతో యాడ్స్ చేయిస్తోందని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.