రెబల్ స్టార్ ప్రభాస్ తో పోలిస్తే నాని చాలా బెటర్ కదా.. అసలు ఈ మధ్య పోలిక ఏంటీ..? అసలు ప్రభాస్ ఎలా బెటర్ అనిపిస్తోంది కదా..? కొన్ని కొందరి విషయాల్లో మాత్రం పోలికలు బెటర్ అనిపిస్తుంది. ఆ పోలికలు నిజమే అని కూడా చెబుతుంటారు. యస్.. ప్రభాస్ కంటే నాని చాలా బెటర్ అనిపించేలా ఒక పోలిక మాత్రం ఈ వ్వవహారంలో కనిపిస్తోంది. మరి ఆ వ్యవహారం ఏంటీ అనుకుంటున్నారు కదా.. సింపుల్ ఓటిటి బిజినెస్.
ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాజా సాబ్. జనవరి 9న విడుదల కాబోతోంది ఈ మూవీ. సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనవరి 9 అంటే సంక్రాంతికి బరిలో ఉంటుందని భావిస్తారు కదా. బట్ ఈ విషయంలోనే వీళ్లు సంక్రాంతికి విడుదల కావడం డౌట్ అనే డైలాగ్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే జనవరి 9న విడుదల కావడం కష్టం అవుతుందే అనుకుంటున్నారు. అందుకు కారణం ఓటిటి బిజినెస్ పూర్తి కాకపోవడమే. యస్.. ఈ మూవీ ఓటిటి బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ కారణంగానే మూవీ రిలీజ్ అవడం కష్టం అనిపిస్తోంది. అందుకు కారణం భారీ ధరకు ఓటిటికి కొనుక్కోవడం అనే కారణంతో మూవీ టీమ్ వెయిట్ చేయడమే. కానీ ఓటిటి నుంచి అంత ధర చెల్లించలేం అనిపిస్తున్నారు. అంత రేట్ కు కొనడం అనేది ఇప్పుడు పెద్ద రిస్క్ అనే భావిస్తున్నారు వాళ్లు. అందుకు కొనడం కంటే అసలు వదిలేయడం కదా అనుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు మాత్రం తేడాగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఓటిటి నుంచి. ఈ కారణంతోనే రాజా సాబ్ కు అంత పెద్ద ధరను పెట్టబోవడం లేదు అనిపిస్తోంది.
బట్ నాని విషయంలో మాత్రం ఇలాంటిదేం లేదు. అతని ద ప్యారడైజ్ మూవీ షూటింగ్ లో ఉంది. షూటింగ్ లో ఉండగానే నెట్ ఫ్లిక్స్ కొనేసింది. అది కూడా వాళ్లు చెప్పిన ధరకు కొనగోలు చేసింది అంటున్నారు. అంతే కాదు.. నాని నెక్ట్స్ సుజీత్ మూవీ కూడా ఆల్రెడీ కొనేసింది. సుజీత్ సినిమా జస్ట్ ఓపెనింగ్ అయింది. ఇప్పటి వరకు షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటి మూవీని కొనడం అనేది మాత్రం చాలా పెద్ద విషయమే అని చెప్పొచ్చు.
సో.. ప్రభాస్ మూవీ కంటే నాని మూవీస్ కు ఇప్పుడు ఓటిటి నుంచి భారీ ధరకు కొనుగోలు వస్తోంది. అలాంటి మూవీస్ పైనే వారు కాన్ సెంట్రేట్ అవుతున్నారు. ప్రభాస్ లాంటి మూవీస్ తో అంటే ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. సందీప్ రెడ్డి వంగా మూవీ స్పిరిట్ మూవీని కూడా ఆల్రెడీ కొనేశారట. అంటే దీన్ని బట్టి దర్శకుల కోసమే ఓటిటి కొనేస్తుంది అనిపిస్తోంది. స్పిరిట్ ఆల్రెడీ డీల్ సెట్ అయింది. సో.. రాజా సాబ్ విషయంలో మాత్రం డౌట్ గా ఉండిపోయింది. ఇటు హీరో, అటు దర్శకుడు కారణంగానే ఈ మూవీ ఓటిటి డీల్ సెట్ కాలేదు అనిపిస్తోంది.