Naresh Maredumilli Prajaneekam: రెండు డబ్బింగ్ చిత్రాల నడుమ.. మారేడుమిల్లి ప్రజానీకం..

Naresh Maredumilli Prajaneekam: ఒక పర్టిక్యులర్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని దాటుకుని నిలబడటం అంత తేలిక కాదు. అత్యుత్తమ టాలెంట్ చూపిస్తే తప్ప అది సాధ్యం కాదు.

Update: 2022-11-22 10:58 GMT

Naresh Maredumilli Prajaneekam: ఒక పర్టిక్యులర్ ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని దాటుకుని నిలబడటం అంత తేలిక కాదు. అత్యుత్తమ టాలెంట్ చూపిస్తే తప్ప అది సాధ్యం కాదు. నిన్నటి వరకూ కామెడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న అల్లరి నరేష్‌.. ఇప్పుడు ఆ ఇమేజ్ ను దాటే ప్రయత్నంలో ఉన్నాడు.



అందుకు నాంది పలికాడు కూడా. ఇక ఇప్పుడు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ నెల 25న విడుదల కాబోతోన్న ఈ మూవీకి రెండు డబ్బింగ్ సినిమాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అందుకు కారణం.. ఆ రెండు చిత్రాలనూ తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలే కావడం.


అల్లరి నరేష్‌ లో మంచి నటుడు ఉన్నాడు అని ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ కామెడీ హీరోగా వచ్చిన ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు చాలాయేళ్లు ప్రయత్నించాడు. అయితే కొన్నాళ్లుగా కామెడీ చిత్రాలు చూసే ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పును క్యాచ్ చేయడంలో వెనకబడ్డాడు నరేష్‌. దీంతోవరుసగా ఫ్లాపులు చూశాడు.



ఈ టైమ్ లోనే ఇమేజ్ మార్చుకోవాలనుకున్నాడు. అలా వచ్చిందే నాంది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈమూవీకి మంచి ప్రశంసలువచ్చాయి. ఇప్పుడు మరోసారి సీరియస్ సబ్జెక్ట్ గా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో వస్తున్నాడు. అయితే ఈ చిత్రం విడుదలవుతోన్న రోజే తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన లవ్ టుడే తెలుగులో అదే పేరుతో వస్తోంది.



దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. అలాగే హిందీలో ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న భేడియాను తెలుగులో తోడేలుగా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ ఇప్పటి ఆడియన్స్ కు అనుగుణంగా కనిపిస్తున్నాయి.



కానీ మారేడుమిల్లి మాత్రం కాస్త సీరియస్ గా కనిపిస్తోంది. పైగా ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ మధ్య థియేటర్స్ సమస్య కూడా ఉంటుంది. మరి చూస్తోంటే ఈ రెండు డబ్బింగ్ సినిమాల మధ్య మన నాంది నరేష్ నలిగిపోతాడో నిలదొక్కుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News