National Film Awards 2023: జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాల సత్తా
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు: బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రంగా 'ఉప్పెన';
గడిచిన 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు దక్కింది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్ హీరో కేటగిరీలో అల్లు అర్జున్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో (పుష్ప) దేవీశ్రీ ప్రసాద్ ఎంపిక కాగా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'ఉప్పెన' ఎంపికైంది. ఇక ఉత్తమ నటిగా అలియా భట్ ఎంపికైంది. ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) అవార్డ్ పురుషోత్తమాచార్యులు సొంతం చేసుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ కు జాతీయ సినిమా అవార్డుల పంట పండింది. ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్, ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణికి ఈ సినిమా తరపున అవార్డులు దక్కాయి,
ఉత్తమ సహాయ నటి
పల్లవి జోషి- 'ది కాశ్మీర్ ఫైల్స్'
ఉత్తమ సహాయ నటుడు
పంకజ్ త్రిపాఠి- 'మిమి'
ఉత్తమ ఫీచర్ ఫిల్మ్
'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'
ఉత్తమ నటుడు
అల్లు అర్జున్-'పుష్ప: ది రైజ్'
ఉత్తమ నటి
అలియా భట్- 'గంగూబాయి కతియావాడి'
'మిమి' కోసం కృతి సనన్
సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
'RRR'
ఉత్తమ కొరియోగ్రఫీ
ప్రేమ్ రక్షిత్ - 'RRR'
Iconic Performer, National Award Winner! 💥🤩
— Geetha Arts (@GeethaArts) August 24, 2023
A pride moment for us! 🌟
Congratulations to our very own ICON STAR @alluarjun wins the prestigious Best Actor Award for #PushpaTheRise at #69thNationalFilmAwards 2023. pic.twitter.com/VLZy231V6r