డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా ఫ్లాపులు పడుతున్నా అతని క్రేజ్ అస్సలే మాత్రం తగ్గడం లేదు. కాకపోతే గతంలో అతనిపై ఉన్న కొన్ని విమర్శలను కూడా సరి చేసుకున్నాడిప్పుడు. లేటెస్ట్ గా నేషనల్ మీడియాలో అతను మాట్లాడిన మాటలకు అక్కడి వారితో పాటు చూసిన వాళ్లంతా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం విజయ్ తెలుగు నుంచి ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఆ ప్రోగ్రామ్ తర్వాత నిర్వహించిన మీడియా మీట్ లో అతని స్టార్డమ్ గురించి అడిగారు. దీనికి అతడు ఓ ఐదేళ్ల క్రితం నేనెవరో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లంతా తనను గుర్తిస్తున్నారు అని చెప్పాడు. అయితే అందుకు ప్రధాన కారణం తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటివారే కారణం అని చెప్పాడు. వారంతా వారి ఫస్ట్ మూవీని తనతో చేశారని.. తనను నమ్మడం వల్లే నేనీ స్థాయికి వచ్చానని చెప్పడం అందరికీ నచ్చింది.
ఇక కింగ్ డమ్ మూవీ టీజర్ కు ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ గురించీ మాట్లాడాడు. ఆయన వల్లే ఆ వాయిస్ అంత అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. డబ్బింగ్ టైమ్ లో మేం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు బెటర్మెంట్ చేస్తూ మళ్లీ మళ్లీ డబ్బింగ్ చెప్పారని.. అందుకు ఆయన థ్యాంక్స్ అన్నాడు. ఇలా.. ఈవెంట్ అంతా విజయ్ దేవరకొండ నడచుకున్న తీరు అక్కడున్న వారందరికీ నచ్చింది. ఇదే యాటిట్యూడ్ తెలుగులో కూడా చూపిస్తే.. అతనిపై ఉన్న నెగెటివిటీ చాలా వరకు తగ్గుతుందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనా ఏ స్టార్ అండా లేకుండా ఓ సాధారణ స్టార్ గా డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసిన ప్రోగ్రామ్ కు వెళ్లడం విజయ్ దేవరకొండ అఛీవ్మెంట్ అనే చెప్పాలి.