Nayanathara : గాడ్‌ఫాదర్ నుంచి నయనతార లుక్ ..!
Nayanathara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్.. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్...;
Nayanathara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్.. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి ఇది రీమేక్... ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. నేడు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఆమె లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో నయన్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. ఒరిజినల్ లో మంజు వారియర్ పోషించిన పాత్రను నయనతార చేస్తోంది. చిరు, నయన్ కలిసి నటిస్తోన్న రెండో చిత్రమిది... వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి చిత్రం వచ్చింది. కాగా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.