నయనతార విడాకులు.. వేణు స్వామి చెప్పినట్టే....?

Update: 2024-03-05 07:42 GMT

హీరోయిన్ నయనతార (Nayantara) ఇప్పుడు ప్యానిండియా మార్కెట్ ఉన్న భామ. ఇద్దరు పిల్లలకు సరోగసీతో జన్మనిచ్చిన నయనతార తన షేపులను కాపాడుకుంటూ వస్తోంది. షారుక్ జవాన్ మూవీతో ఇండియా వైడ్ జనాలను అలరించింది. నయనతారకు ముఖ్యంగా తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా ఆమె పాపులారిటీని సంపాదించుకున్నారు.

డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను (Vignesh) ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగినట్లుగా ఉంది అని అంటున్నారు. పెళ్లి తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదని, పలు వివాదాలలో ఆమె చిక్కుకుంటున్నారని అంటున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కని పెద్ద సంచలనం సృష్టించారు. అప్పుడు ఈమెపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. అలా పెళ్లి తర్వాత నయనతారకు కష్టాలు మొదలవుతాయని ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. సోషల్ మీడియాలో భర్త విగ్నేష్ శివన్ ను ఆమె అన్ ఫాలో చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో విగ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేయడంతో నయనతార విడాకులు తీసుకోబోతుందని నెటిజెన్లు భావిస్తున్నారు.

వార్తలపై అటు నయనతార కానీ ఇటు విగ్నేష్ శివన్ కానీ ఎవరు స్పందించలేదు. దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏడేళ్లపాటు రిలేషన్ లో ఉండి మరీ నయనతార విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పింది చెప్పినట్టుగానే నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News