Nisha Aggarwal: నిషా అగర్వాల్ రెండో బిడ్డ ఆన్ ది వే.. సోషల్ మీడియాలో ప్రకటన..
Nisha Aggarwal: నిషా అగర్వాల్.. కరణ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్‌గా లైఫ్ స్టార్ట్ చేసింది.;
Nisha Aggarwal (tv5news.in)
Nisha Aggarwal: కాజల్ అగర్వాల్ చెల్లెలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిషా అగర్వాల్. పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అందంలో, అభినయంలో కాజల్‌ను తలపిస్తున్నట్టు ఉండేది నిషా. అయితే తనకు ఇండస్ట్రీలో అంతగా కలిసి రాకపోవడంతో కరణ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఉమెన్‌గా లైఫ్ స్టార్ట్ చేసింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా తన రెండో బిడ్డ ఆన్ ది వే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిషా.
సినీ పరిశ్రమలో ఎంతోకాలం స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన కాజల్.. కొంతకాలం క్రితమే గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. పెళ్లయినా కూడా కాజల్ సినిమాలు కంటిన్యూ చేస్తుంది అనుకున్నారంతా.. కానీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ను కూడా ఒక్కొక్కటిగా వదిలేసుకుంది కాజల్. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని కూడా ప్రకటించాడు భర్త గౌతమ్. తాజాగా తన సీమంతం వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఇందులో నిషా అగర్వాల్ కూడా పాల్గొంది. అయితే ఈ వేడుకలో తన అక్క కాజల్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది నిషా.
'అవును ఇది అఫీషియల్‌గా అఫీషియల్. నేను టచ్ చేసిన ఈ గర్భం నుండే నాకు ఇంకొక బిడ్డ వస్తుంది. నా రెండో బిడ్డ ఆన్ ది వే. నా బిడ్డను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాను.' అని నిషా కాజల్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన అక్క, బావకు శుభాకాంక్షలు కూడా తెలిపింది.