కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సినిమా అంటే మళయాలంలో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు.మాలీవుడ్ మైటీ స్టార్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న మోహన్ లాల్ కు ఇండియా మొత్తం అభిమానులున్నారు.తెలుగులో జనతా గ్యారేజ్ తర్వాత ఈ జెనరేషన్ లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మోహన్ లాల్ ఈ మధ్య దర్శకత్వం చేశాడు. ఆ సినిమా పేరు 'బరోజ్'. ది గార్డియన్ ఆఫ్ ద ట్రెజర్ అనేది క్యాప్షన్. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని పూర్తిగా పిల్లలను టార్గెట్ చేస్తూ రూపొందించినట్టు కనిపిస్తోంది.
ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఆకట్టుకునే అడ్వెంచరస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో కనిపిస్తోందీ ట్రైలర్. మోహన్ లాల్ మెయిన్ లీడ్ చేస్తూ డైరెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న విడుదల కాబోతంది బరోజ్. అయితే తెలుగుకు సంబంధించి ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియదు. అసలే మాత్రం ప్రమోషన్స్ లేవు. రిలీజ్ కు చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో ప్రమోషన్స్ చేసినా జనాల్లోకి వెళ్లడం కష్టమే. పైగా ఆ టైమ్ లో మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ కనిపించడం లేదు. కేవలం మాలీవుడ్ వరకు విజయం సాధిస్తే చాలనుకున్నారా లేక.. అక్కడి రివ్యూస్ ను బట్టి ఇతర భాషల్లో కలెక్షన్స్ పెరుగుతాయనుకుంటున్నారో కానీ.. ఇప్పటికైతే ఈ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదనే చెప్పాలి.