Bigg Boss 5 Telugu: టాప్ 5లో ఎవరు ఉండాలో వారే ఎంచుకునే అవకాశం..
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్‌కు చేరుకోవడానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉన్నాయి.;
Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్‌కు చేరుకోవడానికి ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉన్నాయి. అందుకే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారా..? ట్రాఫీ ఎవరికి దక్కుతుందా..? అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదరుచూస్తున్నారు.
బయట హౌస్‌మేట్స్ ఓటింగ్స్ గురించి చాలా కన్ఫ్యూజన్ నడుస్తుండడంతో ఎవరు విన్నర్ అవుతారన్న విషయం ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అందుకే బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌లో టాప్ 5గా ఎవరు నిలుస్తారో వారినే నిర్ణయించుకోమన్నాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఆరుగురు హౌస్‌మేట్స్ మిగిలారు. షన్నూ, సన్నీ, సిరి, కాజల్, మానస్, శ్రీరామచంద్ర. ఇందులో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. అందుకే వీరు ఈ స్థాయి వరకు రాగలిగారు. బయట వీరికి సపోర్ట్ కూడా కొంచెం సమానంగానే ఉంది. మరి వీరిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాప్ 5లోకి ఎవరు వెళ్తారు? అన్నదే పెద్ద ప్రశ్న.
ఈవారం నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా జరగనున్నాయి. బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు 6 నెంబర్ బోర్డులు ఇచ్చి ఎవరు ఏ పొజిషన్‌లో నిలుస్తారు అనుకుంటున్నారో నిర్ణయించుకోమని చెప్పాడు. దాదాపు అందరు కంటెస్టెంట్స్ వారికి నెంబర్ 1 పొజిషన్ కావాలంటూ వాదనకు దిగారు. కానీ అందులో సన్నీ మాత్రం అందరినీ కూల్‌గా ఒప్పించే ప్రయత్నం చేశాడు.