'అమ్మనవుతా'..! ఆకట్టుకుంటున్న ప్రోమో..
NTR Evaru Meelo Koteeswarulu: మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్.;
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్. స్మాల్ స్ర్కీన్ పై 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' అనే రియాలిటీ షో రానుంది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు ఎన్టీఆర్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఇందులో ఒక స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నారు? అని క్లాస్ లో విద్యార్థులను అడిగింది. ఒక్కొ విద్యార్థిని ఒక్కొ రకంగా ఆన్సర్ ఇస్తారు. కలెక్టర్ అవుతానని ఒకరు, పైలెట్ అని మరొకరు సమాధానం చెప్తుండగా.. ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుతా అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కళాశాల చదివే రోజుల్లో కూడా ఆ అమ్మయి తన ఫ్రెండ్స్ కి అదే చెబుతుంది.
ఇక ఆ అమ్మాయి పెద్దయ్యాక అదే ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌లో కూర్చునే అవకాశం వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్.. జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఆ అమ్మాయి 'అమ్మనవుదాం అనుకుంటున్నాను' అని బదులిచ్చింది. రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడిన కష్టాలను వివరించింది. ఆ అమ్మాయి తన జవాబుతో ఎన్టీఆర్ మనసును కూడా గెల్చుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఎన్టీఆర్ వచ్చి 'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చు. ఇక్కడ కథ మీది., కల మీది., ఆట నాది., కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ చెబుతాడు ఎన్టీఆర్. ఈ ప్రోమోలో షో ఆగస్టులోనే ప్రసారం కానుందని ప్రకటించారు.