ఆడియన్స్ లోని మాస్ పల్స్ ను స్టడీ చేసి మరీ సినిమాలు తీస్తోన్న దర్శకుల్లో ఖచ్చితంగా ఉండే పేరు ప్రశాంత్ నీల్. హీరో కనిపించే ప్రతి సీన్ నూ ఎలివేషన్స్ గానే మలుస్తూ ఆ హీరో అభిమానుల్లోనూ ఆ మాస్ ను ఇంజెక్ట్ చేయగల సమర్థుడు ప్రశాంత్ నీల్. అలాంటి నీల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. దీంతో తారక్ అభిమానులంతా ఎంత పనిచేశావ్ ప్రశాంత్ అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే మూవీ రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఎన్టీఆర్ కెరీర్ లోనే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డ్రాగన్ ఉంటుందని చాలకాలంగా చెబుతున్నారు. నిజానికి ఈ మూవీ సలార్ కంటే ముందే రావాలి. ఆలస్యమైంది. సర్లే లేట్ అయినా సంక్రాంతికి విడుదల చేస్తున్నారు కదా అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. యస్.. ఈ మూవీ ఓపెనింగ్ టైమ్ లో జనవరి 9న విడుదల చేస్తాం అని ప్రకటించారు.
సంక్రాంతి టైమ్ లో చాలా సినిమాలున్నాయి. ఆ కారణంగా తప్పుకున్నారా లేదా అనేది తెలియదు కానీ తర్వాత మార్చిలో విడుదల చేస్తారు అనే వార్తలు వచ్చాయి. ఆ టైమ్ లో కూడా రామ్ చరణ్ పెద్ది మూవీ ఉంది. ఈ మూవీకి ఓ రెండు మూడు వారాలు కాస్త అటూ ఇటూగా డ్రాగన్ వస్తుందనుకున్నారు. బట్ అదీ పోయింది. ఈ సారి చాలా దూరం పోస్ట్ పోన్ చేశాం అని చెబుతూ వాయిదా కబురు చల్లగా చెప్పారు. డ్రాగన్ ను 2026 జూన్ 25న విడుదల చేస్తారట. ఆ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మరీ అన్ని నెలలు వాయిదానా అంటూ తలలు పట్టుకున్నారు ఫ్యాన్స్. అందుకే ఎంత పనిచేశావ్ నీల్ అంటున్నారు. నిజానికి ప్రశాంత్ సినిమాలకు పెద్దగా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ఉండవు. అయినా ఇంత ఆలస్యం ఎందుకో మరి.